భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు.