ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, యువకులతో బీర్‌బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. Also…
భార్యలపాలిట యుముడిగా మారిన భర్తలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు. అక్రమసంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోనమ్ అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ప్రియుడి సాయంతో కిరాయి హంతకులను పెట్టి చంపించింది. అంతకు ముందు మీరట్ లో ముస్కాన్ కూడా తన…
ఓ వివాదంలో ఎస్సై కాంగ్రెస్ నాయకుడి చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో ఎస్సైపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ ఐ పై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ ఎస్ పి సెంటర్లో…
ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది.…
జమ్మూ కాశ్మీర్‌లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్‌లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడి నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్, ఇంజక్షన్లు మత్తు మందులను…
మహారాష్ట్రలో దారుణం జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న మహిళపై చిరుతపులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. పూణెకు సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ పొలంలో పని చేస్తుంది. సోయాబీన్ పొలంలో పని చేస్తుండగా మాటు వేసిన చరుత పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌కు వ్యతిరేకంగా వీహెచ్‌పీ బంగ్లాదేశ్ జెండాను దహనం చేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రాబీపై కొందరు దాడి చేశారు. దీంతో..…
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.