Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Why Cm Chandrababu Troubling Ap People Like This Asks Vidadala Rajini

Vidadala Rajini: చంద్రబాబు.. ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు!

Published Date :May 29, 2025 , 1:54 pm
By Sampath Kumar
  • పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం బాబుకు ఇష్టం లేదు
  • ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
  • ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు
  • గిరిజనులకు మరలా డోలీల బాధ తప్పటం లేదు
Vidadala Rajini: చంద్రబాబు.. ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జనాలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు అని విడదల రజని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు.

‘చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు రోడ్డెక్కారు, పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో బాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది ఆయనకు ఇష్టం లేదు. కరోనా సమయంలో వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడు ఏదడిగినా పీపీపీ పద్దతి అంటున్నారు. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ గారు విస్తృత పరిచారు. రాష్ట్ర ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఆయన భావించారు. 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వైద్య విద్య చదివే వారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి అడుగులేశారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు ప్రయివేటీకరణ చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి 5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. 5 వందల కోట్ల విలువైన ఆస్తిని 5 వేలకు ఇవ్వటం ఏంటి?’ అని మాజీ మంత్రి విడదల రజని ప్రశ్నించారు.

Also Read: CM Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు!

‘పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేయదలచుకున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాబు ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం వైఎస్ జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మరలా డోలీల బాధ తప్పటం లేదు’ అని విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm chandrababu
  • tdp
  • vidadala rajini
  • ycp

తాజావార్తలు

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions