మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also read: Fair Accident: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫుట్ వేర్ షాప్..
గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదు., మమ్మల్ని అంతం చేయాలనే కత్తులతో వైసీపీ వర్గం మాపై దాడులకు పాల్పడిందని., పోలింగ్ జరిగే సమయంలో అక్కడే ఉండాలని గాయపడిన తర్వాత కూడా తాను అక్కడే ఉన్నానని ఆమె తెలిపింది. ఈ దాడులకు పాల్పడింది భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులని., పోలీసులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశామని., గెలుస్తామని నమ్మకం ఉన్నపుడు దాడులు చేయటం ఎందుకు అన్నట్లుగా ఆమె వాపోయింది.
Also read: Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం
మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం రెంటాలలో గాయపడిన మంజుల భర్త కోటిరెడ్డి టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. కోటిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటాన్ని సహించలేక కొందరు వైఎస్సార్సీపీ నేతలు దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై విచక్షణారహితంగా గొడ్డలితో దాడికి పాల్పడ్డారు.