Double Ismart Teaser : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ లభించలేదు.అలాగే దర్శకుడు పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు.దీనితో వీరిద్దరికి అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అందుకోసమే ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి కలిసింది.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది.
పూరి జగన్నాధ్,ఛార్మి కౌర్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ రామ్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. డబల్ ఇస్మార్ట్ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేసారు ..ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .పూరి దిమాక్ కిరి కిరి అంటూ మరోసారి తన మార్క్ డైలాగ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతున్నాడు.