దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో అతని రెండవ సినిమా గా తెరకెక్కింది.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.యానిమల్ మూవీ విజయవంతమైన నేపథ్యం లో, ఆ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనే వివరాలు సందీప్ వెల్లడించాడు. సీక్వెల్ తో పాటే మూడోభాగం కూడా తీసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడానే విషయం తెలిసిందే. ఈ స్పిరిట్ సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.ముందు స్పిరిట్ పూర్తయిన తర్వాతే యానిమల్ పార్క్ మొదలుపెడతానని సందీప్ అన్నారు.
రణ్‌బీర్ కపూర్ క్యారెక్టర్ ను ఆరేళ్ల వయసు సినిమాలో మొదలు పెట్టి చూయించడం గురించి సందీప్ ని ప్రశ్నించగా, ఈ సినిమాను మూడు భాగాల్లో తీసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. “ఈ సినిమా 2-3 భాగాల్లో ముసలి రణ్ బీర్ నెరేట్ చేస్తారు. సినిమా ఓపెనింగ్ కోసం ఇది మంచి ఐడియా అనిపించింది.” అని సందీప్ అన్నారు.రెండవ భాగానికి యానిమల్ పార్క్ టైటిల్ నిర్ణయించినట్లు సందీప్ తెలిపారు.. ఎందుకంటే సీక్వెల్ లో ఒకట్రెండు కాదు కొన్ని జంతువుల సమూహం ఉంటుందని తెలిపారు.. పోస్ట్ క్రెడిట్ సీన్ ప్రకారం రణ్‌బీర్ ఈ సీక్వెల్ లో డ్యూయల్ రోల్ లో కనిపించనట్లు తెలుస్తుంది. ఇక జోయా పాత్ర లో నటించిన త్రిప్తి డిమ్రికి సీక్వెల్ లో కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రే ఉన్నట్లు తెలుస్తుంది.మరి యానిమల్ తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.