గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు ఈ విమానయాన సంస్థను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? అసలు దీని చరిత్ర ఏంటి? అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
వాస్తవానికి.. ఎయిర్ ఇండియా ఏప్రిల్ 1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రారంభమైంది. ఎయిర్ ఇండియాను ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటా స్థాపించారు. దానిని టాటా ఎయిర్‌లైన్స్ అని పిలిచేవారు. జె.ఆర్.డి. టాటా 1919లో 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఒక హాబీగా విమానం నడిపారు. ఆయన పైలట్ లైసెన్స్ పొందారు. ఎయిర్‌లైన్ విమానం అక్టోబర్ 15న మొదటిసారిగా ఎగిరింది. జె.ఆర్.డి టాటా స్వయంగా ఈ విమానాన్ని కరాచీ నుంచి అహ్మదాబాద్ మీదుగా ముంబైకి నడిపారు. ఇది సింగిల్ ఇంజిన్ ‘హాక్లాండ్ పస్ మాత్’ విమానం. కానీ ఈ విమానం ప్రయాణీకులను తీసుకెళ్లలేదు. ఉత్తరాలను తీసుకెళ్లింది.
READ MORE: Gaddar Film Awards 2024 LIVE : గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం లైవ్ అప్డేట్స్
‘ఇంపీరియల్ ఎయిర్‌వేస్’ పేరు గల విమానం ఈ ఉత్తరాలను లండన్ నుంచి కరాచీకి తీసుకురావడ ప్రారంభించింది. ఆ సమయంలో ఇంపీరియల్ ఎయిర్‌వేస్ బ్రిటన్ కి చెందిన రాయల్ ఎయిర్ క్యారియర్‌గా ఉండేది. దీని తరువాత, 1933 సంవత్సరం టాటా ఎయిర్‌లైన్స్ వ్యాపారం ప్రారంభించింది. రెండు లక్షల ఖర్చుతో టాటా సన్స్ స్థాపించిన కంపెనీ అదే సంవత్సరంలో 155 మంది ప్రయాణికులను, దాదాపు 11 టన్నుల ఉత్తరాలను తీసుకువెళ్లింది. విదేశాలకు సేవలు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా మారింది. టాటా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు ముంబై నగరం జుహు సమీపంలోని ఒక మట్టి ఇంట్లో ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్న ఒక పొలాన్ని ‘రన్‌వే’గా ఉపయోగించారు. వర్షం పడినప్పుడల్లా ఈ రన్‌వే నీటితో నిండిపోయేది. టాటా ఎయిర్‌లైన్స్ విమానాలు ఒకే ఏడాదిలో 160,000 మైళ్లు ప్రయాణించాయి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం టాటా ఎయిర్‌లైన్స్‌కు ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదు. ఆ సమయంలో ప్రతి ఉత్తరానికి నాలుగు అణాలు మాత్రమే ఇచ్చేవారు.
READ MORE: Punjab IPL: ప్రీతీ షాకింగ్ నిర్ణయం… ఆ ముగ్గురు ఔట్
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, సాధారణ విమాన సర్వీసు భారతదేశంలో ప్రారంభమైంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, జాతీయ విమానయాన సంస్థ అవసరం ఏర్పడింది. భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 49% వాటాను కొనుగోలు చేసింది. టాటా ఎయిర్ లైన్స్ కాస్త ఎయిర్ ఇండియాగా మార్పు చెంది.. ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. 1953లో, భారత ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. ఈ కంపెనీలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. ఈ విధంగా ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారింది. దీని తర్వాత దేశీయ విమానాల కోసం ఇండియన్ ఎయిర్‌లైన్స్ అండ్ అంతర్జాతీయ విమానాల కోసం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పడ్డాయి.
READ MORE: Punjab IPL: ప్రీతీ షాకింగ్ నిర్ణయం… ఆ ముగ్గురు ఔట్
క్రమంగా ఎయిర్ లైన్స్ కాస్త నష్టాల బాట పడుతూ వచ్చింది. దీంతో 2007లో ప్రభుత్వం ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాలను విలీనం చేసింది. చాలా కాలం పాటు నష్టాలు కొనసాగడంతో 2020లో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021లో రూ. 18,000 కోట్లకు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి సొంత చేసుకుంది.