WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
- వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టర
- 27 ఏళ్ల తర్వాత తొలిసారి ICC టైటిల్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి ICC టైటిల్ సాధించింది. 27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు. దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 282 లక్ష్యాన్ని చేధించింది. గత 27 సంవత్సరాలుగా ఆఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’ ముద్ర తొలిగిపోయింది. దక్షిణాఫ్రికా 1998లో తన ఏకైక ICC టైటిల్‌ను గెలుచుకుంది.
Also Read:David Warner: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 207 పరుగులు చేసి బవుమా జట్టుకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్ క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లు బాది 136 పరుగులు సాధించాడు. డేవిడ్ గై బెడింగ్‌హామ్ 18 పరుగులతో రాణించారు. కెప్టెన్ బవుమా 134 బంతుల్లో 66 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read:Australian Big Bash League: సొంత దేశం ఛీ కొట్టింది.. ఆస్ట్రేలియాతో ఒప్పందం
లార్డ్స్ లో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఘనత సాధించింది సౌతాఫ్రికా. టెస్ట్ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది. నాలుగోసారి ఆ రికార్డ్ క్రియేట్ చేసింది సఫారీ జట్టు. 1984లో వెస్టిండీస్ 344 పరుగులను… 2004లో ఇంగ్లాండ్ 282 పరుగులను… 2022లో ఇంగ్లాండ్ 277 పరుగులను విజయవంతంగా ఛేదించింది.. తాజాగా సౌతాఫ్రికా కూడా 282 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..