అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు ఈ విమానయాన సంస్థను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? అసలు దీని చరిత్ర…
Air Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అయితే, విజయ్ రూపానీలాగే గతంలో కూడా భారత రాజకీయ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.