అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. పైలట్ ఆత్మహత్య కారణంగానే ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజుల ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మరవక ముందే.. మళ్లీ ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో…
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. విమానం కూలడంతో నేలపై ఉన్న 19 మంది మరణించారు.
Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన యూకే జాతీయులకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. బాధిత కుటుంబాలకు రెండు మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల న్యాయవాది తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించడగా, కనీసం రెండు శవ పేటికల్లో వ్యత్యాసాలు వెల్లడయినట్లు ఆరోపించారు. ఈ రెండు మృతదేహాల అవశేషాలు బాధిత కుటుంబాలతో సరిపోలలేదని తెలుస్తోంది.
Boeing Jets: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ వైమానిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. విమాన ఇంజన్లకు ఇంధనాన్ని అందించే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లు ఆఫ్ అయిపోయినట్లుగా ఇన్వెస్టిగేటర్లు తేల్చారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 32 సెకన్ల లోపే ‘‘ఇంధన నియంత్రణ స్విచ్’’ల సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతోనే ఇంజన్లకు ఇంధనం అందడం లేదని పేర్కొంది. ఈ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకుంటూ.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశామని ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా ,…
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, భారతదేశ వైమానిక రంగంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురితో కలిపి 270 మంది వరకు మరణించారు. అయితే, దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల తప్పిదంతోనే ప్రమాదం…
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల కారణంగానే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది లోతైన విచారణలో తెలియాల్సి ఉంది. జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మంది మరణించారు.
Ram Mohan Naidu: గత నెలలో జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతో, ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.