Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Disqualification: క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ఆర్డినెన్స్ కాపీలో ఏముంది?. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ కాపీని రాహుల్ చించకుండా ఉండుంటే ఇప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకునే వాడా? అనే చర్చ జరుగుతోంది. వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలు సహా 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. రాహుల్‌పై వేటు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కారణంగా మరో చర్చ ప్రారంభమైంది. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ విషయంలో అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Supreme Court: కొవిడ్ సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలి
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
2013లో ఆ ఆర్డినెన్స్ ఏంటి?
ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడితే ఏం చేయాలన్నదానిపై ఆ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో దోషిగా తేలితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలం పూర్తయ్యాక మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదు. అయితే.. ఒకప్పుడు ఈ చట్టంలోని నిబంధనలు మాజీ ప్రజాప్రతినిధులకు, సిట్టింగ్ సభ్యులకు వేర్వేరుగా ఉండేవి. మాజీ ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులవుతారు. కానీ.. సిట్టింగ్ సభ్యులకు మాత్రం దోషిగా తేలిన తర్వాత 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈలోగా పైకోర్టుకు అప్పీలుకు వెళ్లి, తీర్పు మారేలా చేసుకుంటే.. అనర్హత వేటు తప్పుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సర్కారు ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఈ ఆర్డినెన్స్‌లోని ముఖ్యమైన అంశం. ఆ ఆర్డినెన్స్ కాపీనే రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చింపేశారు. దీని వల్ల కొన్ని రోజుల తర్వాత మన్మోహన్ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. దాని వల్లే ఇప్పుడు రాహుల్ గాంధీపై వేటు పడింది.
9 yrs ago, had Rahul Gandhi not torn the ordinance passed by the UPA govt, which repealed the historic decision of the Supreme Court, saving the convicted MPs from disqualification, today he wouldn't have been disqualified. What an irony! pic.twitter.com/NcwxfyMVP9
— Priti Gandhi (@MrsGandhi) March 24, 2023
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!