హైదరాబాద్ లోక్ సభ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ హౌస్‌లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. ఒవైసీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒవైసీకి వ్యతిరేకంగా లేఖ రాశారు.
క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్‌పై అనర్హత వేటు పడడం గమనార్హం.
ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్‌గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు.
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనో సంచలనం. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. తాను మచ్చలేని రాజకీయా నాయకుడిని అని చెప్పుకొచ్చారు మాజీమంత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20ఏళ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న తాను ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేసారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగానే బరిలోకి దిగుతానని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేసారు. తాను అధికారపార్టీలో…