ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న కాలుష్య స్థాయిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చివాట్లు పెడుతూ.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని కూడా సమాధానం కోరింది. అగ్నిప్రమాదాలను నిషేధించాలని ఆదేశించినా పెద్దఎత్తున క్రాకర్లు ఎలా కాల్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి పటాకులు తెస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. దీపావళికి ప్రజకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజల్లో అవగాహన కొరవడిందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్ వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించించారు. ఈసారి కాలుష్య స్థాయి ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో ఉందని స్పష్టమైనట్లు కోర్టు పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించించారు.
READ MORE: Andhra Pradesh: నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి నిర్మూలన, నియంత్రణపై మంత్రుల కమిటీ ఏర్పాటు
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో అతిషి ప్రభుత్వం దీపావళి పండుగ ముందు కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో అత్యంత వేగంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14(సోమవరం) నుంచి జనవరి 1 వరకు హస్తినలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యాటవరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాణాసంచా నిల్వ ఉంచడం, అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం 2025, జనవరి వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ లో పేర్కొ్న్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే.. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి రోజువారీ చర్య నివేదికలను సమర్పించాల్సిన అవసరం ఉన్నందున.. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత ఢిల్లీ పోలీసులపై పడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు చివాట్లు పెట్టింది.