* విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం.. విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న సీఎం..
* జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం.. సమావేశాల తర్వాత రాత్రి 8.35 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న సీఎం వైఎస్ జగన్
* విశాఖ: నేటి నుంచి జీ 20 వర్కింగ్ గ్రూప్ సదస్సులు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్-IWGకి అతిథ్యం ఇస్తున్న విశాఖ.. G20, యూరోపియన్ యూనియన్ నుంచి పాల్గొననున్న దేశవిదేశీ ప్రతినిధులు.. రెండు వేల 500 మంది పోలీసులతో భద్రత.. బీచ్ రోడ్డుతో పాటు G 20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో ఆంక్షలు.. కైలాసగిరి, ముడసర్లోవ సహా వివిధ పార్కులు, టూరిజం కేంద్రాల్లో సందర్శకులకు నో ఎంట్రీ..
* విశాఖ: పోలవరం ప్రాజెక్టుపై అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం.. పాల్గొనున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ., ఇతర ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు.. 45.72 మీటర్ల ఎత్తులో, 190.60 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం., నిర్వాసితులందరికీ పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపు, ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంపై చర్చ.
* కాకినాడ: నేడు తుని లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి వేణు
* విశాఖ: బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు.. ఈనెల 31న రాష్ట్రంలో మన్యం ప్రాంతాలు బంద్ కు పిలుపు.. నేడు విశాఖలో సమావేశం కానున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న గిరిజన సంఘం ప్రతినిధులు.
* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయం శ్రీరామనవమి ఆస్థానం.. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు హనుమంత వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. 31వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
* అనంతపురం : బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగే ఆసరా వారోత్సవాలలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* శ్రీ సత్యసాయి : పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.. బాలన్నగారిపల్లి క్రాస్, మల్లపల్లి, పాలసముద్రం క్రాస్, బెల్లాలచెరువు, మిషన్ తండా, ఎస్ఎల్ఎపి కంపెనీ, గుడిపల్లి మీదుగా నల్లగొండ్రాయనిపల్లి వరకు సాగనున్న పాదయాత్ర
* అనంతపురం : నగరంలో నేటి నుంచి ఆసరా వారోత్సవాలు..
* తూర్పుగోదావరి జిల్లా : ఎటువంటి అపరాధ రుసుం చెల్లించకుండా పన్నులు చెల్లించడానికి ఈనెల 31వ తేదీ వరకు అవకాశం- రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ కె. దినేష్ కుమార్
* గుంటూరు: నేడు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన.. జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు పథకం ద్వారా జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్న ప్రపంచ బ్యాంకు బృందం.
* నేడు గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటన.. పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు కలెక్టరేట్ వద్ద సామూహిక దీక్షల కార్యక్రమంలో పాల్గొననున్న నారాయణ.
* బాపట్ల: నేడు వేమూరు నియోజకవర్గం పెరవలి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.
* కడప వెటర్నరీ పాలీ క్లినిక్ డిడి డాక్టర్ అచ్చెన్న మృతిపై అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో నేడు త్రిసభ్య కమిటీతో విచారణ..
* కడప : వైవీయు, జాతీయ మానవ హక్కుల కమీషన్ సంయుక్త ఆధ్వర్యంలో మానవ హక్కులపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం..
* తూర్పుగోదావరి: నేడు రాజమండ్రిలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు