* ఆస్కార్ వేదికపై నాటు నాటు సందడి.. అవార్డు ప్రకటనకు ముందే స్టేజిపై నాటు నాటు డ్యాన్స్
* ఢిల్లీ: ఈ రోజు నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండు విడతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నెల విరామం తర్వాత ఈ రోజు తిరిగి సమావేశమౌతున్న పార్లమెంట్ ఉభయ సభలు.. మొత్తం 27 పని దినాలు.. ఈ రోజు ఉదయం పార్లమెంట్ లో సమావేశమౌతున్న ప్రతిపక్షాలు.. ఆర్ధిక బిల్లు ఆమోదానికే ప్రభుత్వ ప్రాధాన్యత
* తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
* అమరావతి: మైనారిటీ వర్గాల పై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్.. ఆయా మతాల పెద్దలు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు.. ఇవాళ ముస్లిం మైనారిటీల మత పెద్దలతో సమావేశం కానున్న సీఎం.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ముస్లిం మైనారిటీ వర్గాల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్ళనున్న మతపెద్దలు
* ఏపీ: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం.. ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగు మాత్రల పంపిణీ
* ప్రకాశం : ఉమ్మడి జిల్లాలో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దం.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం.. పోలింగ్ కేంద్రాలు 138 ఏర్పాటు.. ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్..
* విశాఖ: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు… నేడు ఆరు జిల్లాల్లో పోలింగ్.. బరిలో 37మంది అభ్యర్థులు.. గెలుపుపై వైసీపీ, టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ ధీమా…
* కడప: జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నిలకు ఏర్పాట్లు పూర్తి.. ఉమ్మడి కడప జిల్లాలో 9400 మంది టీచర్స్ ఓటర్లు, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 1,01,900 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
* విశాఖ: నేడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్.. సాయంత్రం 4గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం.. 37మంది పోటీలో ఉండటంతో జంబో బ్యాలెట్ .. ఆరు జిల్లాల పరిధిలో ఎన్నికలు..
* చిత్తూరు : ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరులలో పట్టభద్రుల నియోజకవర్గంలో 453 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. బరిలో ఉన్న అభ్యర్థులు 22 మంది…
* ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు లలో ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు : 27,694 మంది.. పోలింగ్ కేంద్రాలు 176,
* విశాఖ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో నేడు లోకల్ హాలిడే ప్రకటించిన యంత్రంగం.. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు..
* విశాఖ: నేడు కలెక్టరేట్, జీవీఎంసీల్లో జరగాల్సిన స్పందన రద్దు..
* నెల్లూరు జిల్లా శాసనమండలి ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు.. పోలింగ్ కేంద్రాలు 169.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్
* స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని 1105 మంది ప్రజాప్రతినిధులు..
* కడప : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేడు జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు..
* ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జంగారెడ్డిగూడెం కొవ్వూరు నరసాపురం భీమవరంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, 437మంది పోలీస్ సిబ్బందితో భద్రత..
* కాకినాడ: నేటి నుంచి ఈ నెల 18 వరకు అన్నవరం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.. కొండ దిగువన ఉన్న పంపా సత్రం వద్ద త్రికాల అర్చనలు అభిషేకాలు నిర్వహించనున్న కంచి పీఠాధిపతి
* తిరుమల: 21వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 22వ తేదిన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 21, 22వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి.. 22వ తేదీన ఆర్జిత సేవలు రద్దు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు కొవ్వూరు డివిజన్ పరిధిలో రెండు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు భారీ ఏర్పాట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్ధానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మేల్సి స్థానాలకు ఆరుగురు అభ్యర్దులు పోటీ.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న పోలింగ్
* తిరుమల: ఎమ్మెల్సీ ఎన్నికల నేఫధ్యంలో ఇవాళ టిటిడి ఉద్యోగులకు క్యాజువల్ సెలవుగా ప్రకటించిన యాజమాన్యం
* తూర్పుగోదావరి జిల్లా : నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
* శ్రీ సత్యసాయి : కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవం. కర్నాటక,తెలంగాణా నుంచి తరలి వచ్చిన భక్తులు.
* నెల్లూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా 169 పోలింగ్ కేంద్రాల్లో శాసనమండలి ఎన్నికలకు పోలింగ్..
* శ్రీకాకుళం: నేడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఉమ్మడి జిల్లా నాలుగు డివిజన్లలో 69 పోలింగ్ కేంద్రాల్లో జరుగనున్న శాసనమండలి ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ , పటిష్టమైన పోలీసు బందోబస్తు..
* నేడు గుంటూరు ,పల్నాడు జిల్లాల కలెక్టరేట్లు ,పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు….
* బాపట్ల : ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బాపట్ల జిల్లాలో స్పందన కార్యక్రమం రద్దు…
* గుంటూరు: నేడు గుంటూరు ఆర్య సమాజం 54 వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు..
* బాపట్ల: భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..
* కర్నూలు నంద్యాల జిల్లాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 198 పోలింగ్ కేంద్రాలు.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ
* నేడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోనున్న 58502 మంది విద్యావంతులు.. జిల్లాలో మొత్తం ఓటర్లలో 38,625 మంది పురుషులు, 19,868 మంది మహిళా ఓటర్లు, 9 మంది థర్డ్‌జెండర్.. జిల్లా 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు..