1. తెలంగాణలో నేడు రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర. నారాయణపేట మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి ప్రారంభం. నేడు 26.7 కిలోమీటర్ల పాదయాత్ర. బండ్లగుంటలో లంచ్ బ్రేక్. రాత్రి గుడిగండ్లలో బస చేయనున్న రాహుల్ గాంధీ.
2. నేడు హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.64,000 లుగా ఉంది.
3. నేడు సింహాద్రి అప్పన్నకు స్వర్ణ సంపెంగ పుష్పార్చన. గురువారం సందర్భంగా స్వర్ణ కవచదారణ దర్శనం.
4. నేడు నెల్లూరు జిల్లా నేలటూరులో సీఎం జగన్ పర్యటన. జెన్‌కో మూడో థర్మల్ పవర్ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్. మధ్యాహ్నం 1.10 గంటలకు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.
5. టీ20 వరల్డ్ కప్‌లో నేడు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.