* పారిస్: నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ
* నేడు ఐపీఎల్ 2023 ఫైనల్.. ఐపీఎల్-16వ సీజన్‌లో ఫైనల్‌లో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ .. నరేంద్ర మోడీ మైదానంలో ఫైనల్ పోరు.
* నేడు ఎన్టీఆర్ శత జయంతి.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జయంతి వేడుకలు
* ఢిల్లీ: నేడు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద హోమం, పూజ.. పాల్గొననున్న ప్రధాని మోడీ, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ తదితరులు.
* ఉదయం 8.35 గంటలకు నూతన పార్లమెంట్ భవనంలోని లోకసభ ఛాంబర్ లోకి అడుగుపెట్టనున్న ప్రధాని మోడీ.. 8.35 నుంచి 9 గంటల మధ్య “సెన్ గోల్” ( రాజ దండం) స్థాపన కార్యక్రమం
* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి పంచాయితీ అల్లిపాలెం చెంచుగూడెంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో.. అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
* ఒంగోలు గోపాల్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* అనంతపురం : నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష. ఎనిమిది కేంద్రాల్లో పరీక్షాల నిర్వహణకు ఏర్పాట్లు. హాజరు కానున్న 3,213 మంది అభ్యర్థులు.
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి చెల్లుబాయిన వేణు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో టిడిపి మహానాడులో భాగంగా ఏన్టీఆర్ శత జయంతి వేడుకలు. ఉదయం 8 గంటలకు వేమగిరి మహానాడు ప్రాంగణం నుండి టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ..
* నేడు వేమగిరి నుండి బొమ్మూరు, మోరంపూడి , ఆర్టీసి బస్టాండ్ , స్టేడియం రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు చంద్రబాబు ర్యాలీ.. అనంతరం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఏన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న చంద్రబాబు.. సాయంత్రం 3 గంటలకు వేమగిరి జంక్షన్ సమీపంలో వంద ఏకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
* విశాఖ: నేడు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు రెండో రోజు పర్యటన.. OBC మోర్చా ఆధ్వర్యంలో మాన్ కీ బాత్. విశాఖ నుంచి హాజరుకానున్న సోము
* పశ్చిమ గోదావరి: తణుకు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కళషాభిషేకం.. భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కళషాభిషేకం నిర్వహించనున్న అర్చకులు.. ఏడాదికి ఒక్కసారి స్వామివారికి సహస్రకళషాభిషేకం నిర్వహిస్తూన్న టిటిడి
* శ్రీహరికోటలో GSLV రాకెట్ ప్రయోగానికి మొదలు కానున్న కౌంట్ డౌన్
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..
* విజయనగరం: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని హోటల్ ఎన్వీఎన్ లేక్ ప్యాలస్ లో నాగసతీష్ వెల్త్ బిల్డర్స్ ఆధ్వర్యంలో నేడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఉచిత అవగాహన సదస్సు..
* నంద్యాల: నేడు కొలంభారతి ఆలయంలో కుంకుమార్చన, మహా మంగళారతి, ప్రత్యేక పూజలు.. చిన్నారులకు అక్షరాభ్యాసం
* మెదక్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటన.. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష చేయనున్న మంత్రి.. సమీక్షలో పాల్గొననున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
* ఖమ్మం: నేడు సత్తుపల్లి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో యన్ టి ఆర్ శత జయంతి వేడుకలు.. పాల్గొననున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
* ఖమ్మం: నేడు ఎన్టీఆర్ శత జయతి వేడుకల్లో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి పాల్వంచ వరకు ర్యాలీ..
* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఎంఐఎం బహిరంగ సభ.. హాజరు కానున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
* వరంగల్: నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన.. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్ల పాలెం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.. చెర్ల పాలెం, చీకటాయ పాలెం గ్రామాలకు కలిపి చెర్ల పాలెం లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు… హరిపిరాల, కర్కాల గ్రామాలకు కలిపి సురేష్ చందర్ రెడ్డి తోటలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై సన్నద్ధ సమీక్ష సమావేశంలో పాల్గొని సమీక్షిస్తారు.
* వరంగల్: నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పట్లు పూర్తి చేసిన అధికారులు.. వరంగల్ నగరంలో 5,035 మంది అభ్యర్థులు కోసం 11 పరీక్ష కేంద్రాల్లో ఏర్పట్లు చేసిన అధికారులు