* ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న లక్నో సూపర్ జెయింట్స్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్‌లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్.
* ఖమ్మం:నేడు కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొననున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు
* నేడు ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు..
* ఈ నెల 24న ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ సదస్సు.. పాల్గొననున్న టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
* నేడు మధ్యాహ్నం 12 గంటలకు షాద్ నగర్ కు మంత్రులు మొహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో natco ట్రస్టు పర్యవేక్షణలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు.
* కాకినాడ: నేడు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు
* ప్రకాశం జిల్లాలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన.. ఇవాళ గిద్దలూరు, 20న మార్కాపురం, 21న యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. 20వ తేదీన జన్మదిన కార్యక్రమాలను కూడా జిల్లాలోనే నిర్వహించుకోనున్న చంద్రబాబు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుమల: రేపు జులై మాసంకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ..
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా లో పర్యటించనున్న గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. గుంటూరు , నరసరావుపేటలో నవరత్నాలు, పేదలందరికి ఇళ్ళు సమీక్ష కార్యక్రమంలో పాల్గొన నున్న మంత్రి.. పేరేచర్లలో నిర్మితమవుతున్న వైయస్ ఆర్ జగనన్న కాలనీలను పరిశీలించనున్న మంత్రి జోగి రమేష్.
* గుంటూరులో దక్షిణ మద్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యటన … గుంటూరు స్టేషన్ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించనున్న రైల్వే జీఎం
* నేడు నరసరావుపేటలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు, నటుడు అలీ.
* కడప: నేడు రెండో రోజు జిల్లాలో కొనసాగనున్న చంద్రబాబు పర్యటన. బద్వేలులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం. మధ్యాహ్నం బద్వేలు నుంచి పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బద్వేలుకు వెళ్ళనున్న చంద్రబాబు..
* కడప: ఈనెల 21 నుంచి టి-20 క్రికెట్ మ్యాచ్‌లు.. అంతర్ జిల్లాల ఏసిఏ మెయిన్ 20 మ్యాచ్‌ల కోసం ఏర్పాట్లు…
* కడప: నేడు రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప నగరంలో ఇఫ్తార్ విందు, హాజరు కానున్న డిఫ్యూటీ సీఎం అంజాద్ బాష, జిల్లా అధికారులు..
* విశాఖ: గంగా పుష్కరాల కోసం విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే.. మొదటి ప్రత్యేక రైలును ప్రారంభించనున్న ఎంపీ జీవీఎల్.
* 75వ రోజుకు చేరిన టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఆస్పరి మండలం వలగొండ, పుప్పులదొడ్డి, కైరుప్పల, వెంగళదొడ్డి, కారుమంచి, ములిగుండంలో పాదయాత్ర
* విజయవాడ : నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం..