ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది.
నేడు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అప్పులు, ఉపాధ్యాయ పోస్టులు, వైజాగ్ టీడీఆర్ బాండ్లు, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు అంశాలపై సభ్యుల ప్రశ్నలు ఆగడనున్నారు.
నేడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
పోసాని మురళి కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్‌లపై విచారణ కడప మొబైల్ కోర్టు నేటికి వాయిదా వేసింది.
ఈరోజు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో జన ఔషధీ దినోత్సవం జరగనుంది. అతి తక్కువ ధరకు మందులు అందించే ఉద్దేశ్యంతో జన ఔషాదిని ఎంపీ ప్రారంభించనున్నారు.
నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మార్కాపురంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు జనసేనలో చేరనున్నారు.
ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కేసీఆర్ ఫైనల్ చేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్‌లకు గడువు ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజుఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఈరోజ సాయంత్రం కలవనున్నారు.
డబ్ల్యూపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.