ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రేణిగుంటలో టీడీపీ నేత నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి, నెల్లూరులో బీద రవిచంద్ర కుమారుడి రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం హాజరుకానున్నారు.
ఈరోజు సాయత్రం 5 గంటలకు జనసేన శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.
నేడుఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది.
నేటి భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం మెరీనా బీచ్‌లో తమిళనాడు క్రీడాశాఖ తొలిసారి భారీ స్క్రీన్ ఎర్పాటు చేసింది.
నేడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో స్థంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణము జరగనుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
డబ్ల్యూపీఎల్ 2025లో నేడు విరామం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్జ్ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది.