What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం కొవ్వూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు హైదరాబాదులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గుడపల్లిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మాజీ మంత్రి నారాయణ పర్యటించనున్నారు.
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
అఖిలపక్ష ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ వరకు సంఘీభావ ప్రదర్శన చేయనున్నారు. అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. కార్మికులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేయనున్నారు.
నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుపతికి వెళ్లనున్నారు. రేపు శ్రీవారిని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో తమిళిసై బస చేస్తారు.
ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల సమస్యలపై పరిశీలన కమిటీ సమావేశం జరగనుంది. ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చించనుంది. మధ్యాహ్నం 12:30కు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చలు జరపనుంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుపతికి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం భట్టి.. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో భట్టి బస చేస్తారు. రేపు శ్రీవారిని భట్టి దర్శించుకోనున్నారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా మెట్రో రైళ్ల సమయంను ఆదివారం అధికారులు పొడిగించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ (ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు (పీఎన్ఆర్ మార్గ్), అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
తాజావార్తలు
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?