Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramba Urvashi Menaka: ఒకప్పుడు తన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్, గత కొన్నేళ్లుగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కొత్త ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కామెడీకి కాస్త దూరంగా వెళ్లి సీరియస్ పాత్రల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘రంబ ఊర్వశి మేనక’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ కలిసి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం మరో ప్రత్యేకత. కామెడికి ఫాంటసీ ఎలిమెంట్స్ ను జోడిస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా, అల్లరి నరేష్ కెరీర్లో మరో క్రేజీ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యముడికి మొగుడు తర్వాత దాదాపు 14 ఏళ్ల విరామం అనంతరం ఫాంటసీ జానర్లో ఆయన నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. స్వర్గానికి వెళ్లే మెట్లపై అల్లరి నరేష్ సరదాగా కూర్చొని ఉండగా, ఆయన చేతిలో రంబ, ఊర్వశి, మేనక పేర్లు రాసిన తాళపత్రం కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు ఆకాశంలోని మేఘాల మధ్య అప్సరసలు తేలియాడుతున్న దృశ్యాలు సినిమా పూర్తిగా వినోదంతో పాటు ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతుందనే సంకేతాలను ఇస్తున్నాయి. టైటిల్, పోస్టర్ రెండూ కలిసి కథపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ కి ఈ నటులు కలిస్తే రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పడంలో సందేహం ఉండదు. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా, ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు వినోదాన్ని అందించే చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో కామెడీ, ఫాంటసీ, విజువల్ ఎంటర్టైన్మెంట్ను మేళవిస్తూ వస్తున్న ‘రంబ ఊర్వశి మేనక’పై మంచి బజ్ ఏర్పడుతోంది. 2026 సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, అల్లరి నరేష్‌ను మరోసారి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ హీరోగా నిలబెడుతుందా అనేది వేచి చూడాలి.
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!