Today Gold and Silver Price in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. పసిడి కొనుగోలు చేయాలనుకుని.. ధరల పెరుగుదలతో వెనకడుగు వేస్తున్న వారికి ఇదే మంచి సమయం. 10 రోజుల తర్వాత బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. ఆదివారం బంగారం ధర స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,470గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,870గా కొనసాగుతోంది.
Also Read: Samantha : వైరల్ అవుతున్న సమంత 2023 చివరి వర్కౌట్ వీడియో..
ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 300 పెరిగి.. రూ. 78,600లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,000గా ఉంది.