*విశాఖ: గంగవరం పోర్టులో నిరవధికంగా కొనసాగుతున్న కార్మికుల దీక్షలు.. నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పోరాట కమిటీ.
*నేడు వరంగల్‌లో పర్యటించనున్న రైల్వే జీఎం.. 8న ప్రధాని ప్రారంభించనున్న వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్‌తో పాటు వ్యాగన్ తయారీ కేంద్ర శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించనున్న జీఎం
*నేడు వరంగల్‌కి రానున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు కిషన్ రెడ్జి.. ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్‌లోనే మూడు రోజుల పాటు మకాం
*నేడు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. మామడ, సారంగాపూర్ మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేయనున్న మంత్రి.
*తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్ నియామకం
*నేటి నుంచి యాషెస్ మూడో టెస్ట్