ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రియుల ఆశకు నేడు తెరపడనుండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగనుంది. దీంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మధ్య ప్రారంభ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు అహ్మదాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించాలని యోచిస్తోంది. సింగర్ అరిజిత్ సింగ్, నటీమణులు తమన్నా భాటియా మరియు రష్మిక మందన్న ప్రారంభ వేడుకలో తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు. ఒక మిడ్-ఇన్నింగ్స్ డ్రోన్ షో జరుగుతుందని భావిస్తున్నారు, ఇందులో 1,500 డ్రోన్‌లు స్టేడియం పైన ఆకాశాన్ని అలంకరిస్తూ, 2D & 3D చిత్రాలను రూపొందించడానికి ఒకదానికొకటి అల్లిన నృత్యాన్ని కలిగి ఉంటాయి.
అయితే.. ఐపీఎల్ కొత్త రూల్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ రూల్.. గేమ్ కొత్త వ్యూహాలకు అవకాశం కల్పించడమే కాక, మ్యాచ్ను రసవత్తరంగా మార్చనుంది. అయితే, కెప్టెన్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ను నామినేట్ చేస్తాడు. ఈ ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు. ఇతను ఖచ్చితంగా ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. ఇప్పటి వరకు ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బాస్కెట్బాల్, బేస్బాల్, ఫుట్ బాల్, రగ్బీలోనే ఉంది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఆప్షన్ ప్రకారం ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవడానికి జట్టును అనుమతిస్తారు. ఇది గేమ్‌లో కొత్త వ్యూహాలకు అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌ను రసవత్తరంగా మారుస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇలా జట్టులోకి వచ్చే ఆటగాడు భారత ప్లేయర్ అయి ఉండాలని బీసీసీఐ నిబంధన పెట్టింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌ను జట్టు కెప్టెన్ మాత్రమే నామినేట్ చేస్తాడు. ఈ విషయం మైదానంలో ఉన్న అంపైర్‌కి గానీ, ఫోర్త్ అంపైర్‌కి గాని తెలియజేయాలి. అంపైర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంట్రీని ఒక ‘సిగ్నల్’ ద్వారా తెలియజేస్తారు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఓవర్ పూర్తయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా వికెట్ పడినప్పుడు, రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగినప్పుడు ప్లేయర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్సింగ్స్ అయిపోయాక కూడా ఆ ప్లేయర్‌ను ప్రకటించవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయవచ్చు. నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ కూడా చేయవచ్చు.