బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. 23,582 ఓట్లతో గెలుపొందారు. అయితే స్పీకర్ గా ఉండి విజయం సాధించడం చాలా అరుదు.. కానీ పోచారం దాన్ని తిరగరాశాడు. ఈ క్రమంలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తాం, గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజలు నాపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు.. నా విజయం కాదు ప్రజల విజయం, కార్యకర్తల విజయం అన్నారు.
Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించింది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 65 స్థానాలను గెలుచుకోబోతోంది. 2018లో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ వెళ్లినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.