పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూశాం లేదా వార్తల్లో చదివే ఉంటాం. కానీ ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన ఈ మోసం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదనే చెప్పాలి. కస్టమర్ చాకచక్యంతో భారత్ పెట్రోలియం బంక్‌లో కొత్త రకం ఘరానా మోసం బయటపడింది. పెట్రోల్‌లో వాటర్ కలిపి వాహనదారులను నిలువునా మోసం చేశారు పెట్రోల్ బంక్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: CM Chandrababu: సతీమణితో కలిసి సీఎం దీపావళి వేడుకలు.. పిక్స్ వైరల్!
కాకినాడ భారత్ పెట్రోలియం బంక్‌లో పెట్రోల్‌లో పాటు వాటర్ వచ్చిందని ఓ కస్టమర్ ఆందోళన చేశాడు. ఇదేం మోసం అని అడిగినా సిబ్బంది బదులివ్వలేదు. బాటిల్‌లో నీరు చూపిస్తూ అడిగినా రెస్పాండ్ అవ్వలేదు. బంక్ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో.. మూడు గంటలుగా ఆ కస్టమర్ ఆందోళన చేశాడు. మీకు దిక్కున చోట చెప్పుకోండని బంక్ నిర్వాహకులు చెప్పారని, అందుకే తాను నిరసన చేస్తున్నట్లు సదరు కస్టమర్ పేర్కొన్నాడు. కస్టమర్ నిరసనతో నిర్వాహకులు పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి వెళ్లిపోయారు.