కంటి వెలుగు కావాలని ఎవరు చెప్పలేదని, ఓట్ల కోసం ఈ పథకం పెట్టలేదని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీసారు.
Kanti Velugu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సోమవారం నుంచి పదిరోజుల పాటు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కంటి చూపు జబ్బు వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ నివారణకు ఉచిత కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు.