Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
- రెండు రైస్ మిల్లులపై జిల్లా యంత్రాంగం కొరడా
- రూ.52 కోట్లకు పైగా సివిల్ సప్లై బకాయిలు
- అనుమతులు లేకుండా నిర్వహణపై అధికారులు సీరియస్
- బుల్డోజర్లతో మిల్లులను నేలమట్టం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Government Action : వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై రంగానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయిలు పడిన రైస్ మిల్లులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు పూనుకుంది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించి నిర్వహిస్తున్న చాముండి రైస్ మిల్ , సాంబశివ రైస్ మిల్లులను అధికారులు శనివారం కూల్చివేశారు. సివిల్ సప్లైస్ శాఖ, రెవెన్యూ విభాగం , ఇతర అధికారుల ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించి బుల్డోజర్లతో మిల్లు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లకు ఈ చర్య ద్వారా అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
రూ.52 కోట్ల బకాయిలు.. మిల్లర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి చెల్లించాల్సిన సివిల్ సప్లై (CMR) బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ రైస్ మిల్లుల యజమానులు ఏమాత్రం స్పందించలేదు. విచారణలో భాగంగా సాంబశివ రైస్ మిల్ ప్రభుత్వానికి రూ. 13 కోట్ల పైచిలుకు బకాయి పడగా, చాముండి రైస్ మిల్ ఏకంగా రూ. 39 కోట్ల మేర బకాయి పడినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం రూ.52 కోట్లకు పైగా మొండిబకాయిలను చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, కనీస అనుమతులు లేకుండా మిల్లులను నిర్వహించడంతో జిల్లా యంత్రాంగం చట్టపరమైన చర్యలను వేగవంతం చేసింది. రెవెన్యూ శాఖ సహకారంతో ఈ రెండు మిల్లులను పూర్తిగా కూల్చివేసి, బకాయిల రికవరీ దిశగా తదుపరి చర్యలు చేపట్టారు.
Also Read
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
తాజావార్తలు
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!