Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఆటో, క్యాబ్ డ్రైవర్లకు భారీ ఊరట
- మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మరాఠీ భాషపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ నేర్చుకునేందుకు మరో ఏడాది గడువు ఇచ్చింది. ఈ కాలంలో భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్ల లైసెన్స్‌లు, పర్మిట్లు రద్దు చేయబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. మరాఠీ మాట్లాడలేని ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్స్‌లు, పర్మిట్లు రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చ, నిరసనలు మొదలయ్యాయి. ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. మరాఠీ నేర్చుకునేందుకు డ్రైవర్లకు మరో ఏడాది సమయం ఇవ్వాలని కోరారు. వారి విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం.. అదనంగా ఏడాది గడువు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది వ్యవధిలో మరాఠీ భాషా నిబంధనను పాటించలేదనే కారణంతో డ్రైవర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరాఠీయేతర ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
Also Read
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
మరాఠీ భాషపై రాజకీయ వేడి
మహారాష్ట్రలో మరాఠీ భాష వినియోగం, తప్పనిసరి చేయాలనే నిబంధనలపై కొంతకాలంగా రాజకీయంగా వేడి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్స్‌లు, పర్మిట్లకు మరాఠీ భాషా నైపుణ్యాన్ని అనుసంధానించాలనే నిర్ణయంపై విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు ఏడాది గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పరిస్థితిని కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!