Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి, త్రిశూలి నదులు వినాశకరమైన ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే పదలు సంఖ్యలో జనాలు మృతి చెందగా.. వందల సంఖ్యలో గల్లతయ్యారు. అయితే.. ఈ వారదల్లో తెలుగు వాళ్లు కూడా మిస్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. కైలాస మానసరోవర్, నేపాల్ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ గల్లంతు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా మొత్తం 156 మంది తెలుగు యాత్రికులు ఈ పర్యటనకు వెళ్లగా, వారిలో 140 మంది ఆచూకీ లభించడం లేదు.
వరద ఉద్ధృతికి నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పర్యటన కోసం బయటకు వెళ్లిన 140 మందితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో వారి పరిస్థితిపై స్పష్టత కరవైంది. అయితే, అనారోగ్యం కారణంగా గదుల్లోనే ఉండిపోయిన 16 మంది యాత్రికులు ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కంటికి రెప్పలా చూసుకునే తమ వారు సుదూర ప్రాంతంలో గల్లంతయ్యారని తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఘటన తెలుసుకున్న ఇండియన్ ఎంబసీ వెంటనే రంగంలోకి దిగింది. నేపాల్ భద్రతా దళాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా విస్తృతంగా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేసింది. యాత్రికుల కుటుంబీకులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం, సహాయం కోసం నేపాల్ ఎంబసీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. గల్లంతైన 140 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా తిరిగిరావాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!