కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
- కేవలం రూ.7,999కే..
- భారత్‌లో లావా బోల్డ్ N4 లైట్ స్మార్ట్‌ఫోన్..
- 6.75 అంగుళాల qHD LCD డిస్ప్లే..
- MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold N4 Lite: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా (Lava) మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా లావా బోల్డ్ N4 లైట్ (Lava Bold N4 Lite) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పెద్ద డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, Android 16 Go Edition, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కూడా అందుబాటులోనే ఉంచింది.
డిస్ప్లే:
లావా బోల్డ్ N4 లైట్ లో 6.75 అంగుళాల qHD LCD డిస్ప్లేను అందించారు. ఇది 960×540 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. వీడియోలు చూడటం, వెబ్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వంటి సాధారణ అవసరాలకు అనుగుణంగా ఈ డిస్ప్లేను రూపొందించారు. డిజైన్ పరంగా ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. రోజువారీ వినియోగంలో ఎదురయ్యే కొన్ని కఠిన పరిస్థితులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. Empire Gold, Ghost Silver కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది.
Also Read
- 2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
- Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
- Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
- Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ప్రాసెసర్:
మొబైల్ పనితీరు కోసం ఇందులో 28nm UNISOC 9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం PowerVR GE8322 GPU ఉంది. ఫోన్లో 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. అదనంగా 3GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 64GB వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్ సిమ్ తో పాటు మైక్రో SD కార్డు కోసం ప్రత్యేక స్లాట్‌ను కూడా అందించారు. సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ పై పనిచేస్తుంది. తక్కువ హార్డ్‌వేర్ సామర్థ్యం ఉన్న బడ్జెట్ ఫోన్ల కోసం రూపొందించిన తేలికపాటి ఆపరేటింగ్ సిస్టమ్ కావడంతో రోజువారీ పనుల్లో మెరుగైన అనుభూతిని అందించేలా ఇది ఉపయోగపడుతుంది. అనవసరమైన బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందిస్తామని లావా పేర్కొంది. కంపెనీ ఈ ఫోన్‌కు రెండేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనుంది.
కెమెరా & బ్యాటరీ:
కెమెరా విభాగంలో వెనుకవైపు 8MP సింగిల్ కెమెరాను LED ఫ్లాష్‌తో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. అదనంగా 3.5mm ఆడియో జాక్, FM రేడియో, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ కూడా ఉన్నాయి. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్, డేటా బదిలీ కోసం USB టైపు-C పోర్ట్‌ను అందించారు. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 4.2, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర:
లావా బోల్డ్ N4 లైట్ అసలు ధర రూ.8,099గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్లో భాగంగా రూ.7,999కే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. అలాగే లావా తన ఫ్రీ సర్వీస్ @ హోమ్ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దే సర్వీస్ అందించనుంది.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?