బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు…
Teachers Dismiss: యాదాద్రి భువనగిరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను, విద్యాశాఖ సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారి సర్వీస్ ల నుండి తొలగించాలని నిర్ణయించారు. ఈ ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళ ఉపాధ్యాయులు కూడా ఉండగా, మొత్తం 16 మంది ఎస్జిటి (స్కూల్ జూనియర్ టీచర్స్) లు సర్వీస్ నుండి తొలగింపుకు గురయ్యారు. ఈ ఉపాధ్యాయులు, సుదీర్ఘ కాలం పాటు విద్యా…
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.