Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- టిబెట్-నేపాల్ సరిహద్దులో మరో ప్రమాదాన్ని గుర్తించిన చైనా.
- బారియర్ సరస్సు 72 గంటల్లో బద్ధలయ్యే అవకాశం.
- సరస్సులో ప్రస్తుతం 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు.
- మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో భోటేకోసి నది ఉప్పెనలా విరుచుకుపడింది. హిమాలయాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపోవడం, గ్లేసియర్ సరస్సు బద్ధలవ్వడంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ప్రమాదంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని రాసువా జిల్లా అతలాకుతలమైంది. వందలాది ఊర్లు నీటి ప్రళయానికి కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. టిబెల్‌లో కూడా ఈ వరదలు ప్రభావాన్ని చూపాయి.
ఇదిలా ఉంటే, టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బారియర్ సరస్సు రాబోయే 72 గంటల్లో బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. విపత్తు జరిగిన ప్రాంతానికి ఈశాన్యంగా చొచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదులు కలిసే ప్రాంతంలో ఈ సరస్సు ఉన్నట్లు తెలిపింది. గురువారం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. ఇప్పటికే సరస్సు పొంగిపొర్లుతోంది. వచ్చే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
టిబెట్‌లోని గైరాంగ్ సమీపంలో మట్టి, రాళ్ల గోడ లెండే నదిలోకి కూలిపోవడంతో భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించింది. దీంతో భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్, టిబెల్ కలుపుకుని 332 మంది ఇప్పటి వరకు మరణించారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. మరోవైపు నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!