వోక్స్‌వాగన్ ఇండియా తన లగ్జరీ SUV అయిన టిగ్వాన్ ఆర్-లైన్ను ఏప్రిల్ 14, 2025న భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌తో లగ్జరీ SUV సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ SUV లో 2-లీటర్ TSI Evo పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 204 PS శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి…
మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది.
కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ త్వరలో భారత మార్కెట్లో కొత్త SUV వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్‌ను విడుదల చేయనుంది. లాంచ్ కు ముందు SUV ఇంజిన్, పవర్, ఫీచర్లు, డిజైన్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ SUV ని విడుదల చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంజిన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. సమాచారం ప్రకారం ఈ SUV రెండు లీటర్ల సామర్థ్యం…
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
Volkswagen: వచ్చే ఏడాది నుంచి అన్ని కార్ మేకర్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించాయి. టాటా, మారుతి సుజుకీ, హ్యుందాయ్ ఇలా ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ కార్ల ధరల్ని పెంచాలని నిర్ణయించాయి. జనవరి నుంచి కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఇన్‌పుట్, మెటీరియల్ ఖర్చులు పెరుగుతుండటంతో ధరల్ని పెంచుతున్నట్లు వాహన తయారీ కంపెనీలు చెబుతున్నాయి.
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై పడుతోంది. వినియోగదారులకు అనుగుణంగానే అందుబాటులోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్ల తయారీపై మొగ్గుచూపుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ ఏజీ భారత విపణిలోకి వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. `ఐడీ.4` అనే పేరుతో వచ్చే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కారును వచ్చే ఏడాది పరిమితంగా…
కరోనా పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చే దేశం చైనా. చైనాలోనే మొదట కేసులు బయటపడ్డాయి. అయితే, చైనా వాస్తవాలను దాచిపెట్టడంతో ప్రపంచం ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్స్ కొవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్‌తో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలో కేసులు పెరుగుతున్నా చైనాలో కేసులు పెద్దగా లేవని, ఒకటి రెండు కేసులు వస్తున్నా వాటిని కఠినమైన లాక్‌డౌన్ వంటివి అమలు చేసి కట్టడి చేస్తున్నామని చైనా చెబుతూ వస్తున్నది. అక్కడి మీడియా కూడా…