కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విశాల్ కు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది .ఆయన నటించిన అన్ని తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‘హరి’ ఈ సినిమాను తెరకెక్కించారు .దర్శకుడు హరి ఈ సినిమాను పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఇప్పటికే విశాల్,హరి కాంబినేషన్ లో భరణి ,పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో పవర్ ఫుల్ యాక్షన్ “రత్నం” మూవీ తెరకెక్కింది .ఈ సినిమాను కూడా దర్శకుడు హరి తనడైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం .
ఈ సినిమాలో హీరో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది .అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే చిత్ర యూనిట్ వరుసగా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు .రిలీజ్ అయినా ట్రైలర్ ఎంతో పవర్ఫుల్ గా వుంది . ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (యు / ఎ) సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది..అలాగే ఈ మూవీ రన్ టైం 156 నిమిషాల 7 సెకండ్లు ఉన్నట్లు సమాచారం .