ఐపీఎల్ 2025లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నై చెపాక్ కోటను బద్దలు కొట్టింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ విజయం అనంతరం.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ఈ వీడియోను ఆర్సీబీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కోహ్లీతో పాటు.. ఇతర ఆర్సీబీ ఆటగాళ్లు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి ఖుషీ అవుతున్నారు.
Read Also: RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రధానంగా.. రజత్ పాటిదార్ అద్భుతమైన అర్ధశతకం చేయడంతో ఆర్సీబీ 196 పరుగులు చేయగలిగింది. కాగా.. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో బెంగళూరు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెన్నైని వారి సొంత మైదానంలో ఓడించగలిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం ఎంతో ఉత్సాహం కనబరిచాడు. కెప్టెన్ రజత్ పాటిదార్‌కు సహాయపడుతూ.. జట్టు సభ్యులకు సూచనలిస్తూ కనిపించాడు. కాగా.. ఈ విజయంతో ఆర్సీబీ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది.
Read Also: Kim Sharma : స్టార్ హీరోయిన్ కు ఇదేం గతి.. అసిస్టెంట్ గా మారిపోయిందేంటి..?
ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఈ విజయానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయగా.. అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయడంతో పాటు, కోహ్లీ డ్యాన్స్‌కి ఫిదా అవుతున్నారు. కాగా.. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల్లో మరింత నమ్మకం పెరిగింది. ఈ విజయం ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టుకు మరిన్ని విజయాలను అందించేందుకు మార్గదర్శిగా నిలవనుంది.