Kim Sharma : స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ అంటే పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ ఖడ్గం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ స్టార్ స్టేటస్ రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత బిజినెస్ లు చేసింది. కానీ ఇప్పుడు సడెన్ గా ఓ క్యాండిడేట్ కు అసిస్టెంట్ గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పార్టీల్లో తిరిగే ఓర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పెద్ద సెలబ్రిటీ పార్టీ అయినా సరే ఇతను ఉండాల్సిందే.
Read Also : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ‘ఓజీ’ గుడ్ న్యూస్
ముఖ్యంగా హీరోయిన్ల బర్త్ డే పార్టీలు, ఇతర పార్టీల్లో ఇతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కాస్త తేడా క్యాండిడేట్ గా ఉంటాడు. అలాంటి ఓర్రీ దగ్గర కిమ్ శర్మ ఇప్పుడు మేనేజర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీలో మేనేజర్ గా చేస్తోంది. ఈ ఏజెన్సీ కంపెనీ ఓర్రీదే. ఈ కంపెనీని కిమ్ శర్మ తన ట్యాలెంట్ తో లాభాల్లోకి తీసుకొచ్చింది. ఆమె ఆస్తులను రూ.10కోట్లకు పెంచుకుంది ఈ భామ. ఒకప్పుడు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా నటించిన ఆమె.. ఇప్పుడు ఓర్రీ దగ్గర పనిచేయాల్సిన స్థాయికి వెళ్లిపోయిందా అని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికీ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. మళ్లీ సినిమాల్లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.