Preity Zinta talks with Virat Kohli in PBKS vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. విరాట్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. అద్భుత సిక్సర్లతో అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు సిక్సర్లు బాదడం విశేషం. పంజాబ్ ఓటమికి కోహ్లీనే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ సహా యజమాని ప్రీతి జింతా చేతుల మీదుగా విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. విరాట్ ఔట్ అయిన సమయంలో ఎగిరి గంతేసిన ప్రీతి జింతా.. అనంతరం కింగ్‌తో నవ్వుతూ మాట్లాడారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘విరాట్ కోహ్లీని ఎవరు ఇష్టపడరు చెప్పండి’, ‘ప్రత్యర్థి అయినా విరాట్ ఆటకు ఫిదా కావాల్సిందే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Team India Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. 4 విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. అందులో గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరోవైపు 10 పాయింట్లతో పట్టికలో బెంగళూరు ఏడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ నెట్ రన్‌రేట్‌తో గెలిస్తే.. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ వెళ్లే ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే మిగతా జట్లు ఓడితేనే బెంగళూరు ముందడుగు వేస్తుంది.
Cutest picture of Preity Zinta and Virat Kohli!
Who doesn’t love Virat Kohli!#TATAIPL#IPL2024#PBKSvsRCB pic.twitter.com/f57WlyVy6I
— Nilesh G (@oye_nilesh) May 10, 2024
Virat Kohli and Preity Zinta.♥️
One of the coolest IPL owner . pic.twitter.com/Sui1UIx1d8— 𝗶𝘀𝗵𝗶.🏴 (@kohlifangirl178) May 10, 2024