ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు మానియా నడుస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ.. కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. సినిమా ప్రీమియర్ షోల నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు టిల్లు. ఫ్యామిలీ టెన్షన్స్, ఉద్యోగం, బయటి టెన్షన్స్ అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్రబంధం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు చూసేందుకు క్యూ కడుతున్నారు.
Also read: Nama Nageswara Rao: నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు..!
ఇకపోతే మార్చి 29న రిలీజ్ అయిన సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు వచ్చిన ఓ పెద్దాయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో భాగంగా సిద్దు, అనుపమ పరమేశ్వరన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతోంది. ఇక సరిగ్గా అదే సమయానికి అనుపమ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి ఆ పెద్దాయన ఓ టీనేజ్ కుర్రాడుల ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సమయంలో పక్కన ఉన్న కొంతమంది కుర్రాళ్ళు పెద్దాయనను వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాడు. ఈ వీడియోకి నేటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.
Also read: AP Polycet 2024: పాలిటెక్నిక్ లో చేరాలనుకుంటున్నారా.. అయితే ఫ్రీ కోచింగ్ మీకోసమే.. ఎక్కడంటే..?!
టిల్లు స్క్వేర్ రెండు రోజులకు కాను 40 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి టిల్లు 3 కూడా రాబోతున్నట్లు మూవీ మేకర్స్ సినిమా చివర్లో రివాల్ చేశారు.
Legend grand father…
pic.twitter.com/B7XG1XGE99— Esh Vishal (@eshvishal) March 31, 2024