Nama Nageswara Rao: నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా సరిహద్దు వద్ద ఎంపీ నామ నాగేశ్వరరావు వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. అనంతరం నామా మాట్లాడుతూ.. తెలంగాణ రైతు బిడ్డగా రైతుల కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇవ్వాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను చూసి చాలా బాధపడ్డానని అన్నారు. జిల్లా ప్రజలకు, రైతు బిడ్డగా సాయం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రైతులు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేశారని అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాం అని బాధపడుతున్నారని తెలిపారు. మీరైన వచ్చారు చూడటానికి అని ఆయన వాపోయాడన్నారు.
Read also: Puvvada Ajay Kumar: రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది
ఒక్క తడి నిల్లు వదిలి ఉంటే పంట చేతికి వచ్చేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. మా సమయంలో వరి అన్నం తినాలి అంటే పండగ పండగ రావాలని అనుకునేవాళ్లం కానీ, కేసిఆర్ హయాంలో బియ్యం ఎగుమతుల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచామన్నారు. నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. నీల్లు లేక రాష్ట్ర ప్రజలు నిత్యం బోర్లు వేస్తున్నాయన్నారు. మేము రెండు సార్లు హెలికాప్టర్ లో వస్తె నిల్లు, పచ్చని పొలాలు కనిపించేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు వచ్చామో, రైతుల పక్షాన అలానే నిలుస్తామన్నారు.
Khammam: పోడు భూముల వివాదం.. పోలీసులపై కర్రలతో దాడి