ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…