Site icon NTV Telugu

AI Video: “యుద్ధం ఆపేయండి” మోడీ కాళ్ల మీద పడిన పాకిస్థాన్ ప్రధాని.. వీడియో వైరల్

Pm Modi

Pm Modi

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ”ఇది మనమంతా గర్వించదగిన సమయం” అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5 చోట్లు సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు.

READ MORE: Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..

కాగా.. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఆపరేషన్ సింధూర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, భారత్‌కి చెందిన చాలా వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఏఐ వీడియో బయటపడింది. ఈ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. పాకిస్థాన్ ప్రధాని మోడీ కాళ్లపై పడుతూ.. యుద్ధాన్ని ఆపేయండని ప్రాథేయపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన దాడిపై షరీఫ్ బోరున విలపిస్తున్నారు. ఈ ఏఐ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

READ MORE: Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్‌లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..

Exit mobile version