Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 2న లాహోర్‌లోని మినార్-ఎ-పాకిస్థాన్‌లో జరగాల్సిన లష్కరే తోయిబా ర్యాలీ అకస్మాత్తుగా రద్దు చేశారు. లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ర్యాలీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఈ ర్యాలీకి సంబంధించి జనాన్ని ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఈక్రమంలో భారత నిఘా సంస్థలు లాహోర్ ర్యాలీని నిశితంగా పరిశీలిస్తున్నాయి.…
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) తన స్థావరాన్ని మార్చే పనిలో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధంగా పనిచేసే టీఆర్ఎఫ్ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, టీఆర్ఎఫ్‌ని విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా అమెరికా గుర్తించినందున తన హెడ్‌క్వార్టర్‌ను మార్చే పనిలో ఉంది.
చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా తనకు చూపించాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు విదేశీ మీడియా సంస్థలు పాకిస్థాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయని కథనాలు రాశాయి. ఈ అంశంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు…
పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్…
పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.