భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవాణే బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ అనేది భారతదేశం చేపట్టిన ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే అని అర్థం వచ్చేలా పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత సైన్యం 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ నరవాణే, పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ తర్వాత సోషల్ సైట్ ఎక్స్‌లో "సినిమా ఇంకా మిగిలి ఉంది" అని రాసుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్…