వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాల పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు.
ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసం కాగా.. ముగ్గురు మృతి చెందారు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు…
రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.