అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. బన్నీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ లిస్టులో కూడా చేరిపోయింది. విలన్ గా నటించిన రవికిషన్ కూడా బాగానే గుర్తుంటాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రకు ఆయన నిజంగా జీవం పోసి నటించారని చెప్పవచ్చు. భోజ్ పూరి నటుడైన ఈయన ఆ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు. టాలీవుడ్ లో ఆ సినిమా తర్వాత కూడా అనేక సినిమాలలో విలన్ గా నటించి మనల్ని మెప్పించారు. ఒకవైపు ఇలా ఉండగా మరోవైపు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ ప్రాంతానికి ఎంపీగా సేవలందిస్తున్నాడు.
also read: Lok Sabha Elections 2024: 97 కోట్ల ఓటర్లు.. 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు..
ఇకపోతే తాజాగా రవి కిషన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రవి కిషన్ మాట్లాడుతూ.. మా నాన్నకి చాలా కోపం ఎక్కువని.. తనని ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడని చెప్పుకోచ్చాడు. అంతే కాదండి., కోపంలో ఉంటే తాను ఎవరినైనా చంపడానికి వెనుకాడని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఓ రోజు తనని కూడా చంపాలని చూశాడని.. ఆ సమయంలో మా అమ్మ నన్ను పారిపొమ్మని చెప్పగా.. దాంతో వెంటనే కేవలం 500 రూపాయలు జేబులో పెట్టుకొని ముంబై ట్రైన్ ఎక్కేసానని చెప్పుకొచ్చారు. అయితే ఆరోజు మా నాన్న ఎందుకు కోపపడ్డారోన్నదానికి కూడా కారణం లేకపోలేదని తెలిపారు.
also read: India At UN: అయోధ్య, సీఏఏపై పాకిస్తాన్ కామెంట్స్.. భారత్ ఏం చెప్పిందంటే..
రవి కిషన్ మాట్లాడుతూ.. మా నాన్నగారు ఒక గుడి పూజారి. ఆయనలాగే తన కొడుకును కూడా గుడిలో పూజారి కావాలని భావించారు. పూజారి ఒకవేళ కాకపోతే.. ప్రభుత్వ ఉద్యోగినైన లేక వ్యవసాయం చేయడం లాంటి పనులు చేయాలని ఆశ పడ్డాడు. కాకపోతే., తాను నటుడు అవుతానని అసలు ఊహించలేదని తెలిపాడు. ఓ సమయంలో తాను సీత గెటప్ లో నటిస్తున్న సందర్భంలో మా నాన్న చూశాడని.., ఆ తర్వాత తనని బాగా కొట్టడని తెలిపాడు. అయితే., అప్పుడు కొట్టిన దెబ్బలే ఆపై తనకి జీవితం అంటే ఏంటో నేర్పించాయని.. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన కష్టనష్టాలను ఎదుర్కొని ఇప్పుడు మీ ముందు నిల్చున్న అంటూ తెలిపాడు. తాను నటుడు అయినా తర్వాత కూడా సంతోషించారని.. తాను చనిపోయే ముందు కూడా నన్ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపారని ఆయన తన తండ్రి గురించి తెలియజేశారు.