గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార సమన్వయం కోసం కమిటీలు వేశామన్నారు. కాంపెయిన్ కు చెందిన అంశాలపై చర్చించామని, 28వరకు ప్రచారాలు, వ్యూహం పై చర్చించామన్నారు. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ… 28 వరకు ప్రచారం కు సంబందించిన బాధ్యతలు కమిటీ సభ్యులకు ఇచ్చామని, 21నుండి 28వరకు ప్రచారం పీసీసీ, ఏఐసీసీ నేతలు చేస్తారన్నారు. విజయశాంతి ఖమ్మం, మహబూబాబాద్, సిటీ కి దగ్గర్లోని నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారని, 28వ తేదీ వరకు వారి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు కోదండరెడ్డి.
Also Read : Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
కేసీఆర్ అబద్దాలను తిప్పికొట్టేందుకు ప్రచార మరియు ప్రణాళిక కమిటీ పని చేస్తుందని, ప్రతి విషయాన్ని పీసీసీ, ఏఐసీఐ నేతల దృష్టికి తీసుకెళ్లి ముందుకెళ్తామన్నారు కోదండరెడ్డి. రేపు మెదక్, రంగారెడ్డి, అలంపూర్ లలో ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తర్వాత మల్లు రవి మాట్లాడుతూ.. ప్రచారం మరియు ప్రణాళిక బాధ్యతలు అందరికి అప్పగించామని, ప్రచార, ప్రణాళిక కమిటీ అన్ని అంశాలకు సంబంధించి కోఆర్డినేషన్ చేస్తుందన్నారు. 22న మల్లికార్జున ఖర్గే అలంపూర్, నల్లగొండలో ప్రచారం చేస్తారన్నారు.
Also Read : Amit Shah: టీమిండియాకు బెస్ట్ విషెస్.. కప్ తీసుకురావాలని ఆకాంక్ష