విజయవాడలో సెప్టెంబర్ ఒకటవ తేదీన పెద్ద ఎత్తున నిరసనకు దిగారు ఉద్యోగులు. సీపీఎస్ రద్దుకై ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. నగరంలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని…..కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నిస్తున్నారని అప్రమత్తమైంది పోలీస్ యంత్రాంగం.
ప్రభుత్వ ,రైల్వే ఆస్తులపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం వుందంటున్నారు పోలీసులు. నగరంలో సెక్షన్ 144 సిఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో వుంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే పిడి యాక్ట్ లు పెడతాం అని హెచ్చరించారు పోలీస్ కమిషనర్. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మిలియన్ మార్చ్ సంగతి నాకు తెలియదు…ఉద్యోగ సంఘాలు వారి సమస్యల పై పోరాటం చేసే హక్కు వారికుందన్నారు. గత ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి ఉంటే అలాంటి ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. సిఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా? అన్నారు మంత్రి బొత్స.
ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తాం అన్నారు మంత్రి బొత్స. సిపిఎస్ రద్దు చేస్తాము అని ఎన్నికల ముందు హమీ ఇచ్చా0. సిపిఎస్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త స్కీమ్ ప్రతిపాదన పెట్టాం. కొత్త స్కీమ్ సిపిఎస్ ను మించి ఉంటుందన్నారు. సమస్యను అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు.
Read Also: JP Nadda at Hanamkonda : BJP Public Meeting