కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రయాణికులకు చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అర్ధరాత్రి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు పోలీసు శాఖ తరఫున సీపీ హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆలోచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?…
నేడు రాజ్ భవన్ ను ముట్టడించేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు. ఛలో రాజ్ భవన్ నిరసనకు రాయలసీమ జిల్లాలనుంచి విద్యార్ధులు తరలివస్తున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం అంటూ సీపీ హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్యర్యంలో నిరసనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూల్ రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అనంద్ రావు నీ రీకాల్…
ఛలో విజయవాడ నిరసనకు బయలుదేరిన ఉద్యోగ సంఘాల నేతల్ని నిర్బంధిస్తున్నారు పోలీసులు.ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అక్రమ అరెస్టులపై నిరసన వ్యక్తం అవుతోంది. అరెస్ట్ ఎలా చేస్తారు అంటూ నిల దీస్తున్నాయి ఉద్యోగసంఘాలు…? మాకు రైట్ ఉంది అంటున్నారు పోలీసులు. దీంతో బెజవాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై తాము విచారణ చేపట్టామని విజయవాడ సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. అయితే రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు తమకు ఆధారాలేమీ దొరకలేదని సీపీ స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్‌లను కేటాయించామని.. అయితే ఆయన తిరస్కరించారన్నారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని క్రాంతి రాణా మండిపడ్డారు. Read Also: తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం రాధాపై రెక్కీకి సంబంధించి తాము రెండు…
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్‌గా గుజరాత్‌లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్‌లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు…
విజయవాడ కేంద్రంగా ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్ ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణపై నిఘా పెట్టామని, విజయవాడకి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అడ్రస్‌ని మాత్రం 2 సార్లు ఉపయోగించారని, డ్రగ్స్ రాకెట్ అంత ఢిల్లీ కేంద్రంగా జరిగిందని ఆయన వెల్లడించారు. యాక్టివుగా…